Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ రూ.100 కోట్ల సినిమా ఎప్పుడొస్తుందో?

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (11:45 IST)
పవన్ కళ్యాణ్ బర్త్ డే నేడే (సెప్టెంబర్ 2). పవన్ బర్త్ డేను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అందనంత ఇమేజ్.. అంతులేని అభిమానగణంతో చూస్తుండగానే 'ఇంతై... వటుడింతై...' అన్న చందంగా పవన్ కల్యాణ్ ఎదిగిపోయారు. 
 
తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ... ఇక్కడ అబ్బాయి' చేస్తున్నప్పుడు పవన్‌ని చూసి భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. 'తొలిప్రేమ' నుంచి తన సత్తా చూపడం మొదలెట్టాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ... ఇమేజ్ అలా... అలా... అలా... పెరిగిపోయింది. ఈ వేళ తెలుగు సినిమా వసూళ్లకి తను ఒక బెంచ్ మార్క్ అయ్యాడు.
 
మార్కెట్ వర్గాల లెక్కల ప్రకారం 'అత్తారింటికి దారేది' 90 కోట్లకు పైగా వసూలు చేసింది.
తెలుగు సినిమాను 100 కోట్ల క్లబ్బులో చేర్చగల సత్తా పవన్ కల్యాణ్ సినిమాకే వుందన్నది సినీ వర్గాల్లో టాక్. మరి, పవన్ ఏ సినిమాతో ఆ రికార్డు కొడతాడన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. 
 
ప్రస్తుతానికి భారీ కలెక్షన్స్ సాధించే సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకోవాలని డైరక్టర్లు పోటీ పడుతున్నారట. పవన్ ఓకే చెప్పేస్తే సూపర్ కథతో సినిమా చేసేస్తామని.. కలెక్షన్స్ ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి పవన్ ఏమంటారో వేచి చూడాలి.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments