Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యామీనన్ రేంజ్ పెరిగిపోయిందా..? మణి సినిమాతో రూ.2 కోట్లకు..?

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (14:16 IST)
నిత్యామీనన్ రేంజ్ పెరిగిపోయింది. ఎందుకో తెలుసా? మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చే సరికి నిత్యామీనన్ అమాంతంగా రేటు పెంచేసింది. మణిరత్నం దర్శకత్వంలో ఓకే కణ్మణి (తెలుగులో ఒక బంగారం)లో నటిస్తున్న నిత్యామీనన్.. తాజాగా తన పారితోషికాన్ని ఏకంగా రూ.2 కోట్లకు పెంచేసిందని టాక్ వస్తోంది. 
 
తాజాగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నిత్యామీనన్... స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ అయినా ఏమాత్రం పట్టించుకోదు. ఆమెకు నచ్చిన పాత్ర లభిస్తే పారితోషికం విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని నిత్య ఈ మధ్య ఓ నిర్మాతకు భారీ షాక్ ఇచ్చిందట. బాలీవుడ్‌‌లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను దక్షిణాది భాషల్లోకి అనువదించాలని నిర్మాత త్యాగరాజన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారట. 
 
ఈ సినిమాలో కంగనా రనౌత్ చేసిన పాత్రకు సమంత, నయన్, అనుష్క తదితరుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు నిత్యామీనన్‌ను సంప్రదించారట. ఏమాత్రం లేట్ చేయని నిత్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే రూ. 2 కోట్ల పారితోషికం కావాలని కోరిందట. దీంతో, త్యాగరాజన్ బిత్తరపోయారట. నిత్యకు రెండు కోట్లు ఇచ్చే బదులు మరో స్టార్ హీరోయిన్‌ను పెట్టుకుంటే, సినిమాకు పబ్లిసిటీ కూడా వస్తుందనే ఆలోచనలో పడ్డారట. 
 
మరి నిత్యామీనన్ పారితోషికాన్ని పెంచేయడానికి మణి ఫిలిమ్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి త్యాగరాజన్ ఆ ఛాన్స్ నిత్యామీనన్‌కు ఇస్తాడో.. స్టార్ హీరోయిన్‌ను సెలక్ట్ చేసుకుంటాడో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments