Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూకీ చిత్రంలో వెంకటేష్‌... కమల్ 'పుష్పకవిమానం' తరహాలో...

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (21:14 IST)
వెంకటేష్‌ కమర్షియల్‌ అంశాలున్న సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి కూడా అమితాసక్తి చూపిస్తారు. 'ఈనాడు' చిత్రంలో కమల్‌ హసన్‌తో కలిసి నటించారు. కథ ఓ మాఫియా నేపథ్యంలో సాగినా వెంకీ కేరీర్‌లో ఆ చిత్రం ప్రయోగాత్మకంగానే మిగిలిపోయింది. ఆ తర్వాత అలాంటి క్యారెక్టర్లు వచ్చిన నటించడానికి ఎందుకనో అంగీకరించలేదు. అయితే తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నరని ఫిలింనగర్‌ వర్గాలు అంటున్నాయి.
 
ఇప్పటివరకూ మల్టీస్టారర్‌ సినిమాలపై దృష్టి నిలిపిన ఆయన ఓ మూకీ చిత్రంపై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. సంభాషణలు లేకుండా కేవలం ముఖంలో హావభావాలు, సైగలతో  మాత్రమే ఆకట్టుకోవాలన్నది మూకీ చిత్రాల  శైలి. అయితే ఇలాంటి క్యారెక్టర్‌లో గతంలో కమల్‌హసన్‌ సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'పుష్పక విమానం'లో నటించారు. 
 
అప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ తరహా క్యారెక్టర్‌లో వెంకటేష్‌ను ప్రేక్షకులు ఎంత వరకూ అంగీకరిస్తారన్నది ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథ కూడా సిద్ధమైందట. 'పిల్ల జెమిందార్‌' ఫేం అశోక్‌ ఈ చిత్రానికి  దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇటీవలే కథను వెంకటేష్‌కు వినిపించగా నచ్చడంతో  ఆయన కూడా అంగీకరించారని ఫిలింనగర్‌ వర్గాలు అంటున్నాయి.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments