Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీణా మాలిక్‌కు జైలుశిక్ష .. గిల్గిత్-బాల్టిస్తాన్‌ తీవ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (14:53 IST)
పాకిస్థాన్‌కు చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్‌కు పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో తీవ్రవాద వ్యతిరేక కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, తనకు, తన భర్తకు విధించిన జైలు శిక్షపై నటి వీణామాలిక్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం కోసం పోరాడేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ ఈ విషయం నాకు షాక్ కలిగించింది. అయినా, పాకిస్థాన్ ఉన్నత న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కోర్టు మిగతా కోర్టుల కంటే ప్రత్యేకంగా వ్యవహరిస్తుందని ఆమె పేర్కొన్నారు. 
 
కాగా, ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న వీణా, ఆమె భర్త.. దైవ దూషణ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా వీణా, ఆమె భర్త బషీర్‌లతో పాటు జియోటీవీ ఛానల్ అధిపతి మిర్ షకీల్-ఉర్-రహమాన్ లకు 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.13 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments