Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీణామాలిక్‌కు 26ఏళ్ల జైలు శిక్ష: యాంటీ టైజమ్ కోర్టు తీర్పు

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (11:50 IST)
పాకిస్థాన్ నటి, శృంగార తార వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ, దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని యాంటీ టైజమ్ కోర్టు అభిప్రాయపడింది. దీంతో పాకిస్తాన్ అందాల నటి వీణామాలిక్‌‌కు అక్కడి కోర్టు 26 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిది, జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్‌లకు కూడా ఇదే శిక్ష విధించింది. 
 
అసలు జరిగింది ఏమంటే... ఈ మధ్యనే వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్‌లు జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లారు. 
 
ఈ సందర్భంగా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్‌లు డాన్స్ చేసారు. అది ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. 
 
ఈ షో ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దోషులకు 26 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments