Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు పూర్తి!

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (10:06 IST)
సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన జరగకముందు నుంచే తెలుగు సినిమా పరిశ్రమ నుండి తెలంగాణాకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు వేరు కుంపటి పెట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి, విభజన జరిగిన కొద్ది రోజులకే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే సినీ పరిశ్రమను సాంకేతికంగా విభజించడం సాధ్యమేమో కానీ రెండు రాష్ట్రాలలో ప్రదర్శింపబడుతున్న సినిమాలను, వాటిలో నటించే నటీనటులను, పనిచేసే టెక్నీషియన్లను రాష్ట్రాల వారిగా విభజించడం సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. అందుకే నేటికీ తెలుగు సినీపరిశ్రమ యధాతథంగా కొనసాగుతోంది. 
 
అయితే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గొడుగు కింద పనిచేసిన తెలంగాణా నిర్మాతలు, దర్శకులు దాని నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో తెలంగాణాలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వేరేగా ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. 
 
ఇందులోభాగంగా.. సీమాంధ్రకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు కలిసి నిన్న శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నారు. అది రాష్ట్ర సినీ పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తూ దాని అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఈ ఛాంబర్ నిర్వహాకులు వెల్లడించారు. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments