Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరకంగా హింసించాడు... తట్టుకోలేక లొంగిపోయా... నీతూ అగర్వాల్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:23 IST)
ఎర్ర చందనం అక్రమ రవాణాతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కారులో బెంగుళూరుకు పరారవుతుండగా హైదరాబాద్‌లో కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, స్మగ్లర్‌ బాలునాయక్‌ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్‌ పోలీసులకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్ వలీలో నీతూకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది. 
 
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. 
 
మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు. నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలావుండగా, స్మగ్లర్ బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదలీ చేసినట్లు నీతు అగర్వాల్ పోలీసులకు చెప్పారు. ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపయోగించిన కారును సీజ్ చేశారు. మస్తాన్ వలీ, నీతు అకౌంట్ల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments