Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణలో 'తస్కర'

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (17:56 IST)
కిరీటి, సంపత్‌రాజు, శ్రీనివాస్‌ గోవింద్‌, మోనికా హిర్‌మెర్‌ నటీనటులుగా ఎల్‌.ఎమ్‌.ఇ. మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'తస్కర'. మహ్మద్‌ అన్సారి నిర్మాత. చంద్రశేఖర్‌ దేవరపల్లి దర్శకుడు. కేశవ కిరణ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా... దర్శకుడు చంద్రశేఖర్‌ దేవరపల్లి మాట్లాడుతూ ''లక్ష కోట్లు స్కామ్‌ ఎలా జరిగింది అనే పాయింట్‌ ప్రధానాంశంగా తస్కర చిత్రం రూపొందుతోంది. ఒక వ్యక్తి దేశంలోని ఓ అతిపెద్ద బ్యాంక్‌ను ఎలా మోసం చేసి లక్ష కోట్లు స్కామ్‌ చేశాడనేదే కథాంశం. నటీనటులు, టెక్నిషియన్స్‌ సహకారం మరువలేనిది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని నిర్మిస్తున్నారు. అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.
 
చిత్రనిర్మాత మహ్మద్‌ అన్సారి మాట్లాడుతూ ''మనీ స్కామ్‌ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమా  ఆద్యంతం ఆసక్తికరంగా సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ప్రస్తుతం సినిమా లాస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను జరుపుకుంటోంది. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. మంచి టీమ్‌ ఈ సినిమా కోసం పనిచేస్తోంది. ప్రస్తుతం టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని వీలైనంత త్వరలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కేశవ కిరణ్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అండ్‌ సౌండ్‌ డిజైన్‌: రోహిత్‌ కుమార్‌ నాయుడు, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌: శరణ్‌ రాంబాబు ఇంటిపల్లి, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: హిమాన్‌షూ షాని, సినిమాటోగ్రఫీ: రాజేంద్ర పి.నాథ్‌, లిరిక్స్‌: అనంత్‌శ్రీరామ్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే: కిరీటి, నిర్మాత: మహ్మద్‌ అన్సారి, దర్శకత్వం: చంద్రశేఖర్‌ దేవరపల్లి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments