Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు సంఘీభావంగా తమిళ చిత్ర పరిశ్రమ దీక్ష!

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (20:21 IST)
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సంఘీభావంగా తమిళ చలనచిత్ర రంగం మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేసింది. ఈ దీక్షలో పలువులు ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు పాల్గొన్నారు. దీనికితోడు, తమిళనాడు సినీ థియేటర్ల యాజమాన్య సంఘం కూడా పగటిపూట అన్ని షోలను రద్దు చేసింది. 
 
ఈ దీక్షపై ఎమ్మెల్యే, సినీ నటుడు శరత్ కుమార్ స్పందిస్తూ.. జయలలిత ఒక రాజకీయ నేత మాత్రమే కాదని, ఆమె ఒక సీనియర్ నటి అన్నారు. ఆమె కేవలం తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా, ఇతర భాషలకు కూడా ఎంతో మేలు చేశారని, అలాంటి మనిషికి శిక్షపడటం బాధగా ఉందన్నారు. ఏది ఏమైనా.. ఆమెకు సంఘీభావంగా ఈ దీక్షను చేస్తున్నట్టు తెలిపారు. 
 
కాగా, ఈ ఆందోళన కార్యక్రమంలో తమిళ స్టార్స్ సూర్య, విక్రమ్, కార్తి, శరత్ కుమార్, ఆనంద్ రాజ్, రాధా రవి, హీరోయిన్ వింధ్య తదితరులు పాల్గొన్నారు. అయితే కోర్టు తీర్పుపై ఎవరూ స్పందించలేదు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments