Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (11:54 IST)
ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్ చేయనుంది. సీనియర్ హీరో నాగార్జునతో పాటు యంగ్ హీరో ఆవారా యాక్టర్ కార్తీతో కలసి తమన్నా నటించనుంది. నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించనున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుందని సమాచారం. 
 
నాగార్జున, కార్తీలు ఈ చిత్రంలో ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నారని.. ఈ ఛాన్స్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా కార్తీతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. తమిళంలో రూపొందిన 'పయ్యా'(తెలుగులో ఆవారా), 'సిరుత్తై'(తెలుగు విక్రమార్కుడికి రీమేక్) చిత్రాల్లో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక నాగార్జునతో తొలిసారి తమన్నా రొమాన్స్ చేయనుంది. దీంతో ఇన్నాళ్ళు తమన్నాతో రొమాన్స్ చేయాలని కలగన్న నాగ్ ఆశ నెరవేరనుంది. 
 
గతంలో తమన్నాతో సినిమా చేయాలని నాగార్జున ఉవ్విళ్లూరాడని వార్తలొచ్చాయి. అయితే తమన్నా నాగ్ సీనియర్ కావడంతో అంగీకరించలేదని.. ప్రస్తుతం మల్టీస్టారర్ కావడంతో నాగ్‌తో జతకట్టేందుకు మిల్కీ బ్యూటీ ఓకే చెప్పేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకా యంగ్ హీరో కార్తీ ఉన్నాడనే ధైర్యంతోనే నాగ్‌తో చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

బెంగుళూరు రేవ్ పార్టీ : తీగలాగుతుంటే డొంక కదులుతుంది...

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

Show comments