విజయ్, అసిన్ హీరో హీరోయిన్స్‌గా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'కావలన్' చిత్రాన్ని తెలుగులో ఫ్యూచర్ ఫిలింస్ పతాకంపై నిర్మాత జె.ఫణీంద్రకుమార్ 'సింహమంటి చిన్నోడు' పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిక్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత జె.ఫణీంద్రకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ''ఫుల్ మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తమిళంలో ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వున్నాం. విద్యాసాగర్ సంగీత సారధ్యంలో 6 పాటలను, వెన్నెలకంటి, వనమాలి సాహిత్యాన్ని అందించారు.
రాజశేఖరరెడ్డి మాటలు ఈ చిత్రానికి హైలైట్స్. తమిళ సూపర్‌స్టార్ విజయ్, అసిన్‌ల జంట తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. పవర్ఫుల్ క్యారెక్టర్లో రాజ్‌కిరణ్, రోజా, వడివేలు, నిళగళరవి తదితరులు నటించారు. దర్శకుడు సిద్ధిక్ పక్కా మాస్ మసాలా చిత్రంగా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల చేస్తున్నాము'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వెన్నెలకంటి, వనమాలి, కెమెరా: యన్.కె.ఏకాంబరం, నిర్మాత: జె.ఫణీంద్రకుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధిక్.