Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతి హాసన్ ఐటమ్ గర్ల్: మహేష్ కోసం ఒప్పుకుందా? లేకుంటే?

Webdunia
శనివారం, 5 జులై 2014 (17:37 IST)
శ్రుతిహాసన్ కెరీర్‌లో తొలిసారి స్పెషల్ సాంగ్ చేయనుంది. ఐటమ్ గర్ల్‌గా "ఆగడు"లో స్టెప్పులేయనుంది. ఒక్కప్పుడు ఐరన్ లెగ్‌గా ఉండిన ఈ భామ గబ్బర్ సింగ్‌లో పవర్ స్టార్ పక్కన నటించేసరికి ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇదే క్రేజ్‌తో భారీ పారితోషికం పుచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లను కొట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో టాప్ హీరోయిన్‌గా అనేక సినిమాల్లో బుక్కయిన శ్రుతి హాసన్.. ఆగడు సినిమా కోసం రూటు మార్చింది. ఆగడు కోసం ఐటమ్ గర్ల్‌గా అవతారమెత్తింది. తద్వారా కెరీర్‌లో స్పెషల్ సాంగ్ చేయబోతోంది. దీనిపై సినీ వర్గాల్లో మిక్స్‌డ్ రియాక్షన్ వస్తోంది. అభిమానులైతే ఇదేంటబ్బా.. ఐటమ్ గర్ల్‌ శ్రుతిహాసనా.. హీరోయిన్ ఆఫర్స్ తగ్గిపోతాయని వాపోతుంటే.. మరికొందరు భారీ పారితోషికం కోసం స్పెషల్ సాంగ్‌కు ఒప్పుకుందని గుసగుసలాడుకుంటున్నారు. 
 
ఆగడు సినిమాలో తాను మహేష్‌తో డ్యాన్స్ చేయాలంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని శ్రుతి డిమాండ్ పెట్టినా.. సినిమా కోసం ఆమె అడిగిన మొత్తానికి యూనిట్ ఒప్పేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. దీంతో స్పెషల్ సాంగ్‌లో శ్రుతి స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. మరి ఈ ఐటం సాంగ్ శ్రుతిహాసన్‌కు ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments