Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 18న 'సన్నాఫ్ స‌త్య‌మూర్తి' థాంక్స్ మీట్..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:32 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో తెరకెక్కిన 's/o స‌త్య‌మూర్తి' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ హిట్ అనే టాక్ పొందడంతో చిత్ర యూనిట్ అంతా యమా హ్యాపీగా వుంది. 
 
టాలీవుడ్ టాప్ 3 ఓపెనింగ్ గ్రాస‌ర్ గా 's/o స‌త్య‌మూర్తి నిలిచింది. అంతేకాకుండా కర్నాటక తెలుగు చిత్రాల్లో టాప్ 1 గ్రాస‌ర్ గా నిల‌వ‌డం విశేషం. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్ల రికార్డుల సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
 
ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకునేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్ 18న హైదరాబాద్‌లో వైభవంగా థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుందని సమాచారం. కాగా గతంలో బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రానికి సైతం ఇదే తరహాలో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments