Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ కృష్ణజింకల కేసు.. మార్చి 3న తుది తీర్పు..!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:18 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఉన్న కృష్ణజింకలను వేటాడిన కేసులో తుది తీర్పును మార్చి మూడో తేదికి వాయిదా వేశారు. పదహారేళ్ల కిందట బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్రమ ఆయుధాల కేసు తుది విచారణ బుధవారం జోధ్ పూర్ కోర్టు జరిగింది. ఈ విచారణ నిమిత్తం సల్మాన్ కోర్టుకు వచ్చారు. 
 
అయితే కేసును విచారించిన కోర్టు తుది తీర్పును మార్చి 3వ తేదికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపున న్యాయవాది పిల్ దాఖలు చేశాడు.
 
కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడవచ్చని, అంతేగాక వెంటనే బెయిల్ కూడా దొరకదని సమాచారం.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments