Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రుద్రమదేవి' హీరో నేను కాదు.. అనుష్కనే!: దగ్గుబాటి రానా

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (13:56 IST)
టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'లో హీరో అనుష్కనేనని దగ్గుబాటి రానా అన్నాడు. విశాఖలో జరుగుతున్న చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన రానా సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, అనుష్క నటనను ఆకాశానికెత్తేశాడు. సంగీత దిగ్గజం ఇళయరాజా, సంచలన దర్శకుడు గుణశేఖర్‌ల పేర్లు ఉన్న వాల్ పోస్టర్‌లో తన ఫొటో ఉన్నందుకు గర్వంగా ఉందని కూడా రానా వ్యాఖ్యానించాడు.
 
అలాగే, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ‘రాముడు, కృష్ణుడి పాత్రల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటిస్తే, ఆ దేవుళ్లు ఇలా ఉంటారనుకున్నాం. దుర్యోధనుడి పాత్రలోనూ ఆయన జీవించారు. ఏ పాత్రలో నటించినా, ఆ పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు’ అని గుర్తు చేశారు. రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్, తన సొంతూరు నర్సీపట్నంకు చెందినవారన్నారు. భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, టాలీవుడ్ అగ్రనటి అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘రుద్రమదేవి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ విశాఖలో అట్టహాసంగా జరిగింది. సినీ దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమానికి అనుష్కతో పాటు చిత్రంలోని నటీనటులు కూడా హాజరయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు దగ్గుబాటి రానా కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర చిత్రానికే హైలెట్‌గా నిలువనుందని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: క్యాబ్ డ్రైవర్‌తో మహిళ పరిచయం-రూమ్ బుక్ చేయమని.. ఇంకొడితో జంప్!

Pakistan: 2025-2032 మధ్య, పాకిస్తాన్ 80శాతం నాశనం అవుతుంది: వేణు స్వామి

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments