Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పండగ చేస్కో' చిత్రంలో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ న్యూ లుక్‌

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (16:53 IST)
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'సింహా' నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'పండగ చేస్కో'. ఈ చిత్రం నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుగుతోంది.
 
ఈ చిత్ర విశేషాలను దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెలియజేస్తూ - ''మా 'పండగచేస్కో' చిత్రం షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్‌ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. కాస్ట్యూమ్స్‌తోపాటు రామ్‌ గెటప్‌ కూడా డిఫరెంట్‌గా డిజైన్‌ చెయ్యడం జరిగింది. అందరు ఆర్టిస్టులు పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. 
 
సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం. నవంబర్‌ 15 వరకు జరిగే షూటింగ్‌తో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ అవుతుంది. రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా హీరో క్యారెక్టర్‌ చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ యాప్ట్‌గా వుంటుంది. థమన్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు. యూత్‌తోపాటు అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది'' అన్నారు. 
 
ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచనా సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,  ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌,  సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డాన్స్‌: రాజు సుందరం, కాస్ట్యూమ్స్‌: రమేష్‌, మేకప్‌: టి.నాగు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: బి.సత్యం, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: యోగానంద్‌, సమర్పణ: పరుచూరి ప్రసాద్‌, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపిచంద్‌ మలినేని.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments