Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో 'లింగ' చిత్రం : పబ్లిసిటీ కోసమేనా?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై దర్శక, నిర్మాతలు, రచయిత స్పందించారు. ఆ సన్నివేశాలను, సంభాషణలనూ చిత్రం నుంచి తొలగించినట్టు నిర్మాత 'రాక్లైన్' వెంకటేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
 
కాగా అన్నివర్గాల ప్రేక్షకులు సినిమాకు ముఖ్యులేనని, సినిమా ద్వారా సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, అయితే పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని 'లింగ' చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించిన రచయిత శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన చేశారు. పెద్ద మనసుతో 'లింగ' చిత్రంపై వివాదానికి ఇంతటితో తెర దించాల్సిందిగా అన్ని వర్గాలనూ శశాంక్ ఈ సందర్భంగా అభ్యర్తించారు. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన విషయం తెల్సిందే. భారీ మొత్తంలో చెల్లించిన కొనుగోలు చేసిన అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు తాము తీవ్రంగా నష్టపోయినట్టు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశంపై చిత్ర హీరో రజనీకాంత్‌తో వారంతా సోమవారం చెన్నైలో సమావేశం కానున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments