జిల్లా కలెక్టర్‌గా, "లింగా"గా రజనీ డబుల్ రోల్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (16:18 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, అందాల భామ అనుష్క బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్లు నటిస్తోన్న తాజా చిత్రం "లింగా". ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ "లింగా" సినిమాలో రజనీ డబుల్‌రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌గా ఓ పాత్ర పోషిస్తున్న రజనీ "లింగా"గా మరో క్యారెక్టర్‌ని కూడా పోషిస్తున్నాడు. ఐతే కీలకమైన లింగా క్యారెక్టర్ మాత్రం సెకండాఫ్‌లో వస్తుందని అంటున్నారు. ఇందులో రజనీకి ధీటుగా జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. దీనికి ఏ ఆర్ రెహేమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రజనీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

Show comments