Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడి కోసం వెయిట్ చేసిన హీరో.. రభస ఫంక్షన్‌లో కంటతడి!

Webdunia
శనివారం, 2 ఆగస్టు 2014 (12:50 IST)
జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రభస'కు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ...ఆ సినిమా ఆడియో విడుదల సందర్భంగా కంటతడి పెట్టాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్...సంతోష్ శ్రీనివాస్ భుజం తట్టి ఓదార్చారు.
 
వివరాల్లోకి వెళితే రభస షూటింగ్ సమయంలో సంతోష్ శ్రీనివాస్కు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కామెర్లు (జాండీస్) రావటంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు.
 
ఓ టాప్ హీరో... దర్శకుడి కోసం మూడు నెలలు ఆగారని దర్శకుడు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సంతోష్ శ్రీనివాస్ వేదికపై థ్యాంక్స్ తెలిపాడు. ఇక ఆడియో వేడుక అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు జాగ్రత్తలు తెలిపారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ఎప్పుడూ చెప్పేదే అయినా... తండ్రి అయిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పటం విశేషం.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments