Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్‌ సీన్స్‌ వాడుకున్నాం...

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (18:36 IST)
కమల్‌ నటించిన పుష్పక విమానం గుర్తుండే వుంటుంది. మాటలు లేని ఆ చిత్రం తరహాలో మళ్ళీ ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు. కానీ కొత్త టీమ్‌ అలాంటి ప్రయత్నమే చేసింది. పైగా కమల్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా ఇందులో వాడుకున్నట్లు చెబుతున్నారు. సందీప్‌ కుమార్‌, అనీష్‌ ఖాన్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'పుష్పక్‌'. ఈ చిత్రంలో హైదరాబాద్‌కి చెందిన అజామ్‌ సఫీ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మైనుఖాన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. 'మదర్‌ అండ్‌ ఫాదర్‌ బ్యానర్స్‌పై మధుసుధనరావు సమర్పణలో తెరకెక్కుతోంది. 
 
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న విడుదల సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మైనుఖాన్‌ మాట్లాడుతూ..'యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటించిన మూకీ చిత్రం 'పుష్పకవిమానం' తర్వాత వస్తున మరో మూకీ చిత్రమిది. కథపరంగా చాలా భిన్నంగా ఉన్నా.. కమల్‌ హాసన్‌ సినిమాలోని ఒకటిరెండు సన్నివేశాలను ఇందులో కూడా తీసుకున్నాము. భారతదేశంలోనే అతితక్కువ బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఇందులో సందీప్‌ చాలా బాగా నటించాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన అజామ్‌ సఫీ విలన్‌గా అద్భుతంగా నటించాడు. 
 
కొత్తగా, ప్రయోగాత్మకంగా వస్తున్న మా ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హీరో సందీప్‌ మాట్లాడుతూ.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నాకిది రెండవ చిత్రం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ లియుఖాన్‌ మాట్లాడుతూ..'ఇందులో రెండు పాటలున్నాయి. మర్డర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. జనవరిలోనే ఢిల్లీలో విడుదల చేశాం. అక్కడ కంటే ఇక్కడ బాగా ఆదరణ ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇక ఈ సినిమాకు ఫొటోగ్రఫీ: ఆనం వెంకట్‌, మ్యూజిక్‌: కె అండ్‌ ఎమ్‌. ఎడిటర్‌: రామకృష్ణ.జి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments