Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమిస్తే పోయేకాలం' పాటలు విడుదల

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (16:24 IST)
ప్రవీణ్‌ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ తులసి ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.ఇ.రాజు నిర్మిస్తున్న 'ప్రేమిస్తే.. పోయేకాలం' పాటలు 'యు మీడియా' సారధ్యంలో.. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదలయ్యాయి. రవిచంద్ర దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కె.కార్తీక్‌ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ సరసన శ్వేత జాదవ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి సుధ ముఖ్యపాత్ర పోషించారు. 
 
ఆడియో విడుదల కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రముఖ నిర్మాతలు చేగొండి హరిరామజోగయ్య, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దైవజ్ఞశర్మ, 'బర్నింగ్‌స్టార్‌' సంపూర్ణేష్‌ బాబు, 'హృదయ కాలేయం' దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌, నటి సుధ, శ్రావ్యారెడ్డి, అలేఖ్య, 'యూ మీడియా' ప్రతినిధి నవీన్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. యూనిట్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. సంపూర్ణేష్‌ బాబు ఆడియోను ఆవిష్కరించి తొలిప్రతిని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు.
 
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... 'వైవిధ్యమైన కథాంశంతో.. డిఫరెంట్‌ జోనర్‌లో తెరకెక్కిన చిత్రం 'ప్రేమిస్తే పోయేకాలం'. టైటిల్‌ నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.. సబ్జెక్ట్‌ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మా నాన్నగారు-నిర్మాత డి.ఇ.రాజు ఈ సినిమాని మంచి క్వాలిటీతో నిర్మించారు. మా దర్శకుడు జి.రవిచంద్ర చిత్రాన్ని చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. కె.కార్తీక్‌ అందించిన ఆరు బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఆడియోతో పాటు సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.
 
నటి సుధ మాట్లాడుతూ... 'సినిమా షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. యూనిట్‌ సభ్యులందరూ నాకు కుటుంబ సభ్యుల్లా మారిపోయారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments