Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా షూటింగ్‌లో చుక్కలు చూపించారు : ప్రేమ ప్రయాణం హీరో

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (17:13 IST)
సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత హోదాలో మస్తాన్ వలీ, హీరోయిన్ నీతూ అగర్వాల్‌కు తమకు చుక్కలు చూపించారనీ, వారి వేషాలు వర్ణించలేమని ప్రేమ ప్రయాణం హీరో మనోజ్ నందం అంటున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మస్తాన్ వలీతో పాటు నీతూ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై హీరో మనోజ్ నందం మాట్లాడుతూ.. ఎర్ర స్మగ్లర్ మస్తాన్ వలీ 'ప్రేమ ప్రయాణం' సినిమా నిర్మించినప్పుడు తమకు చుక్కలు చూపించేవాడన్నారు. సినిమా షెడ్యూల్ ప్రకారం జరగలేదని, దానికి కారణం వారిద్దరిమధ్య ఉన్న సన్నిహిత సంబంధాలేనని వెల్లడించాడు. స్పాట్‌లో నిర్మాత లేకపోతే నీతూ అగర్వాల్ షూటింగ్ జరగనిచ్చేది కాదని, తలనొప్పి అనో లేక ఇంకోటనో చెప్పి షూటింగ్ ఆపేసేదని, దాని కారణంగా తాను రెండు అవకాశాలు కోల్పోయానని మనోజ్ నందం వాపోయాడు. 
 
ఇప్పటి వరకు తాను ఆ సినిమానే చూడలేదని, ఎందుకంటే సినిమాను వాళ్లు ఇష్టపడి తీయలేదని, అసలు సినిమా పూర్తవుతుందని కూడా తాను భావించలేదన్నారు. నీతూ కోసం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తానని మస్తాన్ వలీ చెప్పేవాడని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయని మనోజ్ నందం వెల్లడించాడు. షూటింగ్‌లో ఎవరూ ఇబ్బంది పెట్టకుండా విపరీతంగా డబ్బు వెదజల్లేవాడని మనోజ్ తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

Show comments