Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్ డాటర్ సాంగ్: ట్విట్టర్లో పోస్ట్.. సూపర్ కామెంట్స్!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:08 IST)
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కి ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్దమ్మాయి పేరు పూజ. చిన్నమ్మాయి పేరు మేఘన. ప్రకాశ్ రాజ్ లాగే ఆయన కూతుళ్లు కూడా బాగా ప్రతిభావంతులు. 
 
ఈ ఇద్దరూ ఆయన మొదటి భార్య లలితకుమారి పిల్లలు. ఆమెకు విడాకులిచ్చినప్పటికీ, ప్రకాశ్ రాజ్ తన పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇటీవల పూజ తన స్నేహితుడితో కలసి సరదాగా ఓ ఇంగ్లిష్ పాట పాడింది. ‘i will follow you into the dark’ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది.
 
కుమార్తె చేసిన ఈ ప్రయత్నం పట్ల ప్రకాశ్ రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఆయన స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేసారు. ''నా ముద్దుల కూతురు తన స్నేహితుడితో కలసి ఓ పాట కంపోజ్ చేసుకుని పాడింది. 
 
ఇది ఓ తండ్రిగా నేను చాలా గర్వపడాల్సిన విషయం. అందుకే ఆ వీడియోను ఆనందంగా షేర్ చేస్తున్నాను. ఛీర్స్” అంటూ ట్విట్టర్‌లో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు కోలీవుడ్ ప్రముఖులు పూజ చాలా బాగా పాడిందని ప్రకాశ్‌కు ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట. అంతేకాకుండా ట్విట్టర్లో పూజ సాంగ్‌కు సూపర్ కామెంట్స్ వస్తున్నాయట. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments