Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలో రాజమౌళి మగధీర: ప్రభుదేవా రీమేక్!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (15:56 IST)
ప్రముఖ నటుడు, కొరిగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా బాలీవుడ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. నయనతార ప్రేమాయణం కటీఫ్ అయ్యాక ఇక పిల్లల భవిష్యత్తే ముఖ్యమని తేల్చుకుని.. సినీ షూటింగ్‌లలో బిజీ అయ్యాడు. ఇందులో భాగంగా తెలుగులో పౌర్ణమి, సమ్‌థింగ్ సమ్‌థింగ్ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన ప్రభుదేవా.. తాజాగా హిందీలో మగధీర సినిమాను రీమేక్ చేయనున్నాడు. 
 
రాజమౌళి రూపొందించిన 'మగధీర' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ  తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నాడియాడ్ వాలా ఈ హక్కులను భారీ రేటుకి తీసుకున్నాడు. ఇందులో హీరోగా నటించడానికి షాహిద్ కపూర్ ముందుకు వచ్చాడు. 
 
కాగా, దర్శకుడిగా ప్రభుదేవా ఖరారైనట్టు తాజా సమాచారం. హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాల బోగట్టా.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments