Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటుడిపై లాఠీ పంచ్ రుచి చూపించిన పోలీసులు!

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (14:58 IST)
కన్నడనాట పోలీసు అధికారులు కన్నడ నటుడిపై తమ లాఠీ పంచ్ రుచి చూపించారు. అతగాడు ఏ తప్పు చేయకపోయినా.. కావాలనే అతడిపై దాడికి దిగి పిడిగుద్దులు గుద్దారు. వివరాల్లోకి వెళ్తే.. శాండల్ వుడ్ నటుడు చేతన్ మిడ్’నైట్ సమయంలో చర్చి గేట్’లోని తన మిత్రులను కలిసి తిరిగి వస్తుండగా.. అక్కడే వున్న పోలీసులు ఇతని కారును ఆపేశారు.
 
కారణమేమీ చెప్పకుండానే అతని కారు తాళం తీసుకుని అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడట స్థానిక ఎస్సై! అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీపీ కూడా ఆ హీరో మీద చెయ్యి చేసుకున్నాడు. కొద్దిసేపు తన లాఠీతో అతడికి ‘పంచ్’ ఇచ్చి, బూతుపురాణాన్ని వినిపించారట!
 
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చేతన్.. ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్’కు చేరుకున్నాడు. అయితే.. అక్కడా కూడా ఇతడిపై చెయ్యి చేసుకున్న ఎస్సై చేరుకుని, అతడిపై ఆగ్రహావేశంతో ఊగిపోయి లాకప్’లో వేశాడట!.
 
అలా కొద్దిసేపు తన ప్రతాపం చూయించిన అనంతరం అతడిని వదిలేశాడట! దీంతో తన తప్పు లేకపోయినా ఈ విధంగా పోలీసులు దారుణంగా ట్రీట్ చేయడంపై తన బాధను నగర పోలీస్ కమిషనర్ ముందు మొరపెట్టుకున్నాడు చేతన్!

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments