Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ డాక్టర్‌ను బెదిరించిన సి కళ్యాణ్.. జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (13:57 IST)
దుడుకుగా ఉంటారని చెప్పుకునే టాలీవుడ్ సినీ నిర్మాత సి కళ్యాణ్‌పై మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌లో ఓ మహిళా వైద్యురాలిని బెదిరించారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5లో గల ఓ ఫ్లాట్‌ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్‌ కవిత, సి.కళ్యాణ్‌ మధ్య వివాదం నెలకొంది. ఆఫ్లాట్‌ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌ కొంత మేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్‌ఎంసీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. 
 
అయితే వచ్చే నగదును వ్యక్తిగతంగా కాకుండా ఫ్లాట్‌ఓనర్స్‌ అసోసియేషన్‌లో వేయమని సి.కళ్యాణ్‌ కోరగా, అందరికి వేరువేరుగా ఇవ్వాలని కవితతో పాటు మరో ఐదుగురు కోరారు. దీంతో వివాదం చెలరేగింది. 
 
పైగా, కవితకు సంబంధించిన ఫ్లాట్‌ను కూడా తనకే అమ్మాలంటూ సి.కళ్యాణ్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్‌పై 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments