Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్... మెగా ఫ్యామిలీకి దూరమైనట్టేనా?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (10:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరమైనట్టేనా అనే చర్చ హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. తాజాగా, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'పిల్ల నువ్వు లేని జీవితం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. నిజానికి సాయి ధరమ్ తేజ అంటే పవన్ కళ్యాణ్‌‍కు అంతులేని ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే, తేజూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం వెనుక పవన్ పాత్రే కీలకం. అలాంటి పవన్ తన మేనల్లుడి సినిమా ఫంక్షన్‌కి డుమ్మా కొట్టారు. అంతకుముందు, రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో ఫంక్షన్‌కు కూడా పవన్ హాజరు కాలేదు.
 
దీంతో మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ పూర్తిగా దూరమైనట్టేననే చర్చ తెరపైకి వచ్చింది. సాధారణంగా మెగా ఫ్యామిలీకి చెందిన సినీ ఫంక్షన్లకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, మెగా ఫ్యామిలీ హీరోలు, అల్లు అరవింద్ తరలివస్తారు. 'పిల్ల నువ్వు లేని జీవితం' ఫంక్షన్‌కు కూడా పవన్ మినహా మిగిలిన వారంతా తరలి వచ్చారు. ఫంక్షన్ కొనసాగుతున్న సమయంలో అభిమానులు పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటూ గట్టిగా అరిచారు కూడా. దీంతో రాంచరణ్ జోక్యం చేసుకుని నాకు కూడా గట్టిగా అరవాలని ఉందంటూ వ్యాఖ్యానించడంతో వారంతా మిన్నకుండి పోయారు. 
 
అయితే, మెగా ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ దూరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయనే విషయం అందరికీ తెల్సిందే. పైగా మెగా ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది. దీంతో మెగా ఫ్యామిలీకి, పవన్‌కు గ్యాప్ బాగా పెరిగిందని సినీ విశ్లేషకులు కూడా చెపుతున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చిరంజీవి ఆలోచనలకు, పవన్ సిద్ధాంతాలకు చాలా వ్యత్యాసం ఉంది. 
 
ఈ కారణాలతోనే రాజకీయ కారణాలతోనే మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటున్నారా? అనే సందేహం కూడా తలెత్తుతోంది. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ మంచి దోస్త్‌గా, అత్యంత నమ్మకస్తుడిగా మారడం, అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ తరపున ఉండటం కూడా వీరి దూరానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments