Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటాస్ రికార్డు... కళ్యాణ్ రామ్ 'పటాస్‌' ఫస్ట్ డే కలెక్షన్ అంతా...?

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (14:06 IST)
కళ్యాణ్ రామ్ హీరోగా 'పటాస్‌' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మూడు కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ టాక్. ఇది కళ్యాణ్ రామ్ చిత్రాల కలెక్షన్స్ లో తొలి రికార్డు అని అంటున్నారు. 
 
ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే... కళ్యాణ్‌ సిన్హా (కళ్యాణ్‌ రామ్‌) ఏసీపీగా ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి.. తన కింద పని చేసే పోలీసులని కూడా అవినీతికి పాల్పడమని ఎంకరేజ్ చేస్తాడు. తప్పులు చేసే వాళ్లతో జత కలిసి తన షేర్‌ తను తీసేసుకుంటూ వుంటాడు. 
 
అయితే ఓవైపు టీవీ జర్నలిస్టు అయిన మహతిని (శృతి సోది) ప్రేమించమంటూ వెంట పడుతూనే, మరోవైపు సిన్సియర్‌గా పనిచేసే డిజిపిని (సాయికుమార్‌) టీజ్‌ చేస్తుంటాడు. పోలీసులంటే పడని రాజకీయ నాయకుడు జి.కె. (అశుతోష్‌ రాణా)చేసే అకృత్యాలకి కూడా ఊతమిస్తుంటాడు. కరప్ట్‌ ఆఫీసర్‌ అయిన కళ్యాణ్‌ సిన్హా తనని తాను ఎలా కరెక్ట్‌ చేసుకుంటాడు, జీకేకి ఎలా బుద్ధి చెప్తాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments