Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీణామాలిక్‌కి 26 సంవత్సరాల పాటు జైలు.. కెరీర్ ఓవర్?

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:44 IST)
కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించిన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్‌కి 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వీణా మాలిక్ సినీ కెరీర్ ముగిసినట్లేనని వార్తలు వస్తున్నాయి.
 
పాకిస్థాన్‌లోని జియో టీవీలో దైవదూషణ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీణామాలిక్‌కి కోర్టు ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. వీణా మాలిక్‌తోపాటు ఆమె భర్త బషీర్, టెలివిజన్ యాంకర్ షకి ష్టా వాహిది జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్‌లకు కూడా ఇదే శిక్ష విధించింది. 
 
అసలు జరిగింది ఏమంటే... ఈ మధ్యనే వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్‌లు జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లారు. 
 
ఈ సందర్భంగా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్‌లు డాన్స్ చేసారు. అది ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. 
 
ఈ షో ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దోషులకు 26 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments