Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బ్యూటీకి స్వైన్ ఫ్లూ... ఆస్పత్రిలో చేరిన సోనం..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:24 IST)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ స్వైన్ ఫ్లూకు సోకింది. రాజ్‌కోట్ సమీపంలో ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం నాడు ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆ చిత్ర షూటింగ్ రద్దు చేయబడింది. 
 
దేశాన్ని పీడిస్తున్న స్వైన్ ఫ్లూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు కూడా సోకిందట. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ప్రబలిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. గుజరాత్‌లో షూటింగ్ చేస్తుండగా నటి సోనమ్ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. తరుచుగా సోనమ్ దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతుండగా ఆమెను వెంటనే రాజ్‌కోట్‌లోని స్టెర్లిన్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఐతే సోనమ్‌కు ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు భావిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకున్నారు. కాగా ఈ వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు  నిర్ధారణ అయింది. సోనమ్ పాల్గొంటున్న సినిమా సెట్లో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. దీంతో స్వైన్ ఫ్లూ సోకిన సోనమ్ కపూర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments