Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుందట...

Webdunia
బుధవారం, 13 మే 2015 (20:24 IST)
‘ఓకె ఓకె’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌`నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌’. తమిళంలో ఘనవిజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో.. రెడ్‌ జైంట్‌ ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి హేరిస్‌ జైరాజ్‌ సంగీతం అందించారు. ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ చిత్రం గురించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘రెడ్‌ జైంట్‌ ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రం నయనతార ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది. హేరిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలు తమిళంలో సూపర్ హిట్ అయ్యాయి. 
 
తెలుగులోనూ ఖచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతాయనే నమ్మకం ఉంది. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వారంలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రం నయనతార అభిమానులకు పండుగలా ఉంటుందని అన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments