Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అంటే ఓ పిచ్చి... అంతా బోగస్... నజీరుద్దీన్ షా విమర్శ..!

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (14:51 IST)
అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డును బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్ షా తీవ్రంగా విమర్శించారు. ఆర్ట్ చిత్రాల నటుడిగా పేరు తెచ్చుకున్న నజీరుద్దీన్ షా ఆస్కార్‌ గురించి మాట్లాడుతూ.. ఆస్కార్ అంటే ఒక పిచ్చి అని వ్యాఖ్యానించారు. 
 
భారతీయులకు, ముఖ్యంగా బాలీవుడ్ సినీ జనానికి ఆస్కార్ పై ఉన్న మోజు ఓ మూర్ఖత్వమని అన్నారు. ఆస్కార్ అవార్డులన్నీ బోగస్ అని, గత యేడాది ఎవరికి అవార్డ్ వచ్చిందో ఇవాళ గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా లేదని తేల్చి చెప్పారు.
 
ఆర్ట్ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నజీరుద్దీన్ షా ఇప్పటికీ ఉత్తమ నటుడిగా రెండు సార్లు జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ మధ్య 'ఇక్బాల్' మూవీకి గానూ ఉత్తమ సహాయనటుడిగానూ అవార్డ్ కైవసం చేసుకున్నారు. ఆర్ట్ చిత్రాలు తనకు నటుడిగా పేరు తెచ్చిపెట్టినా, కమర్షియల్ సినిమాలే తన జేబుని నింపాయని, బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచాయని నజీరుద్దీన్ షా చెబుతున్నారు.
 
కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెల పదో తేదిన విడుదల కాబోతున్న 'ధర్మ సంకట్ మే' చిత్రంలో దొంగబాబాగా నజీరుద్దీన్ షా నటించారు. అదేవిధంగా 'వెల్ కమ్ బ్యాక్'లో కామెడీ పాత్ర చేశానని, 'వెయిటింగ్' మూవీలోని పాత్ర కూడా తనకు ఎంతో తృప్తినిచ్చిందని నజీరుద్దీన్ షా తెలిపారు.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments