Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి.... యువ హీరో నాని

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (20:57 IST)
విభిన్నమైన కథా చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు నాని. ముఖ్యంగా స్టార్డం కంటే కూడా నటుడిగానే చక్కటి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం నాని హీరోగా నటించిన చిత్రం జెండాపై కపిరాజు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై పి రామమోహనరావు సమర్పణలో రజత్ పార్థసారధి, శ్రీనివాసన్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదలవుతున్న సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ... ఈ ఉగాది నాకో కొత్త అనుభూతిగా ఉండబోతుంది. ఒకేసారి రెండు చిత్రాలు జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం విడుదల అవ్వడం చాలా ఆనందంగాను, అదే టైంలో టెన్షన్‌గాను ఉంది. 
 
రెండు విబిన్నమైన సినిమాలు కావడం ప్లస్ అయ్యింది. ఇక జెండాపై కపిరాజు సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. ముఖ్యంగా ఇందులో రెండు పాత్రలు చేయడం నాకే కొత్తగా అనిపించింది. ముందు ఈ కథ సముద్రఖని చెప్పినప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా అనిపించింది, కాని సముద్రఖని సపోర్ట్‌తో ఈ రెండు పాత్రలు చాలా బాగా చేశాను. ఒక పాత్ర మనలో ఒకడిగా సాధారణ యువకుడిగా కనిపిస్తాను, రెండో పాత్ర తమిళనాడు నుండి వ్యక్తిగా భిన్నమైన నటన కనబరిచాను. మీరు చుస్తే నిజంగా ఇది నాని నా లేక వేరే వ్యక్తా అనేలా ఉంటుంది.
 
మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నిన్ను నివ్వు బాగుచేసుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుంది అనే మెసేజ్‌తో సముద్రఖని అద్భుతంగా రూపొందించారు. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక నిర్మాతలు కుడా ఎక్కడా ఏ విషయంలో తగ్గకుండా భారీగా నిర్మించారు. సో... తప్పకుండా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కుడా ఓ కొత్త ఫీల్ కలుగుతుంది .. ఈ ఉగాదికి ఈ రెండు సినిమాలతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments