Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సారయిన 'నాని బుజ్జి బంగారం'

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (20:09 IST)
దృశ్య కావ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆదేశ్‌ రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.చంద్రకుమార్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నాని బుజ్జి బంగారం'. చందు, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్‌,కాంచన, రోహిత్‌,లలిత, రాదండి సదానందం, ఆదేశ్‌ రవి, ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'ఎ' సర్టిఫికెట్‌ అందుకుంది. 
 
ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు ఆదేశ్‌ రవి మాట్లాడుతూ... ''ఇదొక యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌.ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో చాలా విభిన్నంగా ఉండే చిత్రమిది. సినిమా చూశాక ఆడియన్స్‌ కూడా ఈ మాటే అంటారు. సెన్సార్‌ పూర్తి చేశాము. సింగిల్‌ కట్‌ కూడా లేకుండా క్లీన్‌ 'ఎ' సర్టిఫికేట్‌ ఇవ్వడమే కాకుండా ప్రజంట్‌ ట్రెండ్‌కు కనెక్ట్‌ అయ్యేలా సినిమా చాలా కమర్షియల్‌గా వుందంటూ సెన్సార్‌ సభ్యులు చెప్పడం విశేషమని' అన్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ... ''సినిమా అవుట్‌పుట్‌ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాము. దర్శకుడికిది తొలి చిత్రమైనప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా తెరకెక్కించారు. దర్శకత్వమే కాకుండా సంగీతం కూడా తనే సమకూర్చారు. ఇటీవల విడుదలైన పాటలు ప్రజాదరణ పొందాయి. ఆడియో సక్సెస్‌ సాధించి మా సినిమాకు ఎంతో క్రేజ్‌ను ఏర్పరిచింది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాము'' అన్నారు. 
 
ఈ చిత్రానికి కెమెరా: మహేష్‌ కె స్వరూప్‌; కొరియోగ్రఫీ:అన్నారాజ్‌; ఎడిటర్‌: రాజేంద్రప్రసాద్‌.ఎమ్‌.; పాటలు:సాంబ, సురేష్‌ గంగుల, ఐత శ్రీనివాస్‌; నిర్మాత: కె.చంద్రకుమార్‌ రెడ్డి; కథ-స్క్రీన్‌ప్లే-సంగీతం-దర్శకత్వం:ఆదేశ్‌ రవి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments