Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా చాలా హాట్ గురూ అంటున్న నాగార్జున...

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (20:12 IST)
టాలీవుడ్ మన్మథుడు, గ్రీకు వీరుడు నాగార్జున అంటే ఇష్టం లేని హీరోయిన్లు ఉన్నారా అంటే నో అని చెప్పాల్సిందే. మన్మథుడిని ఇష్టపడని వారు ఎవరూ వుండరు కదా. మహిళా ప్రేక్షకులకైతే నాగార్జున ఎప్పుడో గ్రీకు వీరుడుగా మారిపోయారు. వయసు పెరుగుతున్నా నాగార్జున మాత్రం యంగ్ లుక్ తో అందం స్టైలిష్ గా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ ఆయనతో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు.
 
అలాంటి గ్రీకు వీరుడు నాగార్జున ప్రత్యేకించి ఓ హీరోయిన్ హాటెస్ట్ అన్నారంటే ఇంకేముంది ఆ హీరోయిన్ కు పండగే. ఇపుడా అదృష్టం పాలపిల్ల తమన్నాకు దక్కింది. విషయం ఏంటయా అంటే, తాజాగా ఓ టెలివిజన్ షోలో సీనియర్ నటి సుహాసినితో గెస్ట్ గా ఓ ప్రోగ్రాములో నాగార్జున పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో సుహాసిని సరదా ప్రశ్నలు కొన్నింటిని నాగ్ పై సంధించింది.
 
ఈ సందర్భంగా సుహాసిని నాగార్జునకు ఓ ప్రశ్న వేస్తూ... ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో మీకు హాట్‌గా అనిపించిన హీరోయిన్ ఎవరంటూ నలుగురు హీరోయిన్ల పేర్లు చెప్పింది. వారిలో సమంత, కాజల్ అగర్వాల్, శృతిహాసన్, తమన్నా పేర్లు చెప్పింది. దానికి నాగ్ ఏమన్నాడంటే, నలుగురూ హాట్ బ్యూటేసే... ఐతే అందరికంటే తమన్నా వెరీ హాటెస్ట్ అని చెప్పేశాడు. 
 
అంతే, సుహాసిని దీనిపై ఇక ఎంతమాత్రం చర్చించలేదు. తమన్నా ఎందుకు హాటెస్ట్... మిగిలిన ముగ్గురు ఎందుక్కాదు వగైరా ప్రశ్నలు వేస్తే చర్చ ఏ దారికి వెళుతుందనుకుందో ఏమోగానీ అంతటితో ఆ టాపిక్ కు కట్ చెప్పేసింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments