Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీలో ఎవరు కోటీశ్వరుడు.. నాగార్జున హిట్.. చిరంజీవి ఫట్!

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (12:18 IST)
మీలో ఎవరు కోటీశ్వరుడు చివరి ఎపిసోడ్‌ ఎలా సాగిందన్న చర్చ ఇపుడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. తొలి ఎడిషన్ చివరి షోలో ప్రత్యేక అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇదే ఈ షో ముగింపు ప్రత్యేకతగా భావించారు. ఇందుకోసం ఎప్పుడూ లేని విధంగా కోటీశ్వరుడు సెట్‌ను అందంగా అలంకరించారు. ఇంతకంటే ఆ ప్రోగ్రామ్‌లో ప్రత్యేకత ఏమిలేదని పెదవి విరుస్తున్నారు. 
 
ఫిలింనగర్‌లో మాత్రం చిరంజీవి ఎపిసోడ్‌ ఏదో వుంటుందని ఊహించారు. కానీ ఆయన ప్రతిమాటల్లోనూ నాగార్జునను పొగడం.. నాగార్జున కూడా పొగిడించుకోవడం మినహా ప్రత్యేకత ఏమీలేదు. ఇటువంటి ప్రోగ్రామ్‌ చేస్తుంటే.. నువ్వు మారతావ్‌! అని నాగ్‌కు అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పుడో చెప్పాడు. అది నాగార్జున కూడా మీడియాకు తెలిపాడు. మళ్ళీ నేను మారానా? లేదా? అన్నట్లుగా చిరంజీవితో అడిగి మరీ తెలుసుకున్నాడు నాగార్జున. ఇంతకంటే ఆ ఎపిసోడ్‌లో ప్రత్యేకత ఏమీలేదని సినిమా ఇండస్ట్రీ భావిస్తోంది. 
 
ఇకపోతే... హిందీలో అమితాబ్‌ ప్రోగ్రామ్‌ ఆకట్టుకున్నప్పుడే తెలుగులో ఇటువంటిది చేయాలని చిరంజీవి దృష్టికి వచ్చింది. కానీ తనకు సమయంలేదనీ చేయలేనని చేతులెత్తేశాడు. నాగార్జున దృష్టికి మాటీవీ కూడా అప్పట్లోనే సూచించింది. తనకింకా ఆ సమయం రాలేదని అంటూనే వాయిదా వేస్తూ వచ్చారు. ఆయన లక్‌ బాగుండి.. మిగతా ఏ హీరో ఏ ఛానల్‌లోనూ ఇటువంటి ప్రోగ్రామ్‌ చేయకపోవడంతో నాగార్జున స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయ్యాడు. 
 
పైగా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు లేవు. హీరోగా ఎలాగూ చేయలేను. మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తానని ప్రకటించిన వెంటనే మాటీవీ ఆరు దానికోసం ప్రోగ్రామ్‌ తయారు చేశారు. నార్త్‌లో సిద్దార్ధ్‌రాయ్‌ మీలో ఎవరు కోటీశ్వరుడుకు ప్రణాళిక చేశారు. తెరపై ఎలా కన్పించాలి. ఎలా మాట్లాడాలి అనే దానికి శిక్షణ ఇచ్చాడు. మొత్తాన్ని నాగ్‌ ప్రోగ్రామ్‌ హిట్‌. కానీ చిరంజీవి ఎపిసోడ్‌ ఫట్‌ అనే విమర్శలు వస్తున్నాయి. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments