Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు... ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతా..!

Webdunia
సోమవారం, 4 మే 2015 (10:55 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందార తార అనుష్క. అనుష్క నటించిన రెండు భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా వస్తున్న అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క ఇప్పటి వరకు తన పెళ్లి గురించి పెదవి విప్పలేదు. 
 
అయితే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు సన్నిహితంగా ఉంటున్నట్లు అనుష్క వీడియో చిత్రాలు ఇంటర్నెట్‌లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో వివాహం గురించి అనుష్కను ప్రశ్నించగా, తనకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదన్నారు. అయితే తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని స్పష్టం చేశారు. అయినా వివాహం మనం అనుకుంటే జరగదని, దానికంటూ టైం వస్తుందని పేర్కొంది. అయితే తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి గురించి మాత్రం చెప్పలేదు.
 
కాగా ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహించనున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో అనుష్క ప్రధాన పాత్రలు పోషించింది. ఆ చిత్రాలు వేసవిలో విడుదల కానున్నాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments