Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాక్షతో మంగళ సూత్రం కేసు... కుష్బుకు ఊరట..!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (12:41 IST)
రుద్రాక్షతో మంగళ సూత్రం ధరించిన కేసులో ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బుకు ఊరట కలిగింది. ఈ పిటిషన్‌ను కుంభకోణం కోర్టు తోసిపుచ్చింది. తమిళనాట వివాదాలకు పెట్టింది పేరు కుష్బూ. ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో హల్‌చల్ చేస్తుంటుంది. ఇటీవల ఓ వార పత్రికలో రుద్రాక్షను మంగళ సూత్రంలో కలిపి ఆమె ధరించడం వివాదానికి దారి తీసింది. 
 
వార పత్రికకు కుష్బు ఇచ్చిన ఫోజును చూసిన కుంభకోణం సమీపంలోని ఉమామహేశ్వర పురం శంకర సారంగపాణి పేటకు చెందిన బాల కోర్టును ఆశ్రయించాడు. రుద్రాక్ష అన్నది పవిత్రమైనదని, నిత్యం శివనామస్మరణతో దేవుడ్ని పూజించే వాళ్లు, భక్తులు వాటిని ధరించాలని వివరించారు. 
 
ఈ పిటిషన్ కుంభకోణం రెండవ అదనపు కోర్టులో న్యాయమూర్తి శరవణభవన్ ముందు విచారణకు వచ్చింది. మంగళవారం విచారణ సమయంలో పిటిషనర్‌ను న్యాయమూర్తి పలు రకాల ప్రశ్నల్ని సంధించారు. సంప్రదాయాల్ని మంట గలుపుతున్నారని పేర్కొన్నారుగా, ప్రత్యక్షంగా చూశారా? ఓ వార పత్రికలో వచ్చిన ఫొటో ఆధారంగా పిటిషన్ వేయడాన్ని ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఆధార రహితంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా, విచారణయోగ్యం కాదని పరిగణించి కోసు కొట్టిపారేశారు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments