Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమసిన 'కత్తి' వివాదం...విడుదలకు రంగం సిద్ధం

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:46 IST)
ఇళయ దళపతి విజయ్ హీరో నటించిన కత్తి సినిమా విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఈ సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై హీరో విజయ్ మంగళవారం ఉదయం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'లైకా' పేరును సినిమా నుంచి తొలగిస్తున్నట్లు అందులో విజయ్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారమే తమిళనాడులో సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 
 
అంతకుముందు కత్తి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పడంతో సోమవారం రాత్రి చెన్నైలో రెండు థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వి, బాంబులు విసిరి విధ్వంసాన్ని సృష్టించారు. థియేటర్ల వద్ద పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈళం తమిళుల వ్యవహారంలో రాజపక్సపై మండిపోతున్న తమిళనాడు ప్రజలు కత్తి చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిమాండును అంగీకరించడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments