Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ఆయనతో ప్రయాణం... కాజల్ వాంఛ తీరింది...

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (12:33 IST)
నటి కాజల్ అగర్వాల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. అందుకు కారణం ఆమె చిరకాల వాంఛ తీరడమేనట. అసలు సంగతేమని చూస్తే.. ఇటీవలే హైదరాబాద్ రావడానికి ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు కాజల్. విమానం అరగంట ఆలస్యం అని తెలియడంతో సెలబ్రిటీ టెర్మినల్‌కి చేరుకున్నారు. అయితే... అక్కడ తీరిగ్గా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిని చూడగానే కాజల్‌కి సంతోషంతో గంతేసింది. అమాంతం ఆ వ్యక్తి దగ్గరకెళ్లి ‘‘సార్... నేను మీ ఫ్యాన్‌ని’’ అంటూ పరిచయం చేసుకున్నారట. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే... సల్మాన్‌ఖాన్. యాదృచ్ఛికంగా సల్మాన్ కూడా హైదరాబాద్ ఫ్లయిట్ కోసమే వెయిటింగ్.
 
సల్మాన్‌తో కలిసి హైదరాబాద్ దాకా ప్రయాణం చేయొచ్చని తెలీగానే.. ఆనందంతో కాజల్ ఉబ్బితబ్బిబ్బయిపోయారట. ఫ్లయిట్ రాగానే... సల్మాన్ పక్క సీట్ వ్యక్తిని రిక్వెస్ట్ చేసి మరీ... సల్మాన్ పక్కన చేరారట. 
 
ఇంకేముంది... హైదరాబాద్ వచ్చేదాకా కబుర్లే కబుర్లు. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ చెబుతూ ‘‘చిన్నప్పట్నుంచీ సల్మాన్ వీరాభిమానిని నేను. ఫ్లయిట్‌లో తనతో సన్నిహితంగా మెలిగాను. విమానంలో ఉన్నంతసేపూ కబుర్లు చెప్పాను. ఆ క్షణాలు నా జీవితంలో మరచిపోలేనివి. నిజంగా నేను లక్కీ. తను చాలా పద్ధతైన మనిషి’’ అంటూ కితాబులిచ్చేశారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments