Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాసిని జెనిలీయాకు అబ్బాయి పుట్టాడోచ్..!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (11:17 IST)
హాసిని జెనిలీయాకు అబ్బాయి పుట్టాడు. తెలుగులో ‘బొమ్మరిల్లు’, ‘హ్యాపీ’ ఇంకా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో సుపరిచితురాలిగా నిలిచిన జెనీలియా పండంటి బాబుకు మంగళవారం జన్మనిచ్చింది.
 
ముంబైలోని ఓ హాస్పిటల్‌లో జెనీలియా మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను 2012లో జెనీలియా వివాహమాడిన సంగతి తెలిసిందే. జెనీలియా మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు.
 
ఈ సంవత్సరం ఆరంభంలో జెనీలియా తల్లికాబోతుందనే విషయాన్ని రితేష్‌ ప్రకటించాడు. తాజాగా వీరిద్దరు మగ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా సల్మాన్‌ ఖాన్‌ చెల్లి అర్పిత ఖాన్‌ వివాహ నిశ్చితార్థంకు హాజరయ్యారు. 
 
అక్కడికి వచ్చిన వారంతా కూడా జెనీలియా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జెనీలియా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇకపోతే.. జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ దంపతులు తల్లిదండ్రులైన సందర్భంగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు అందుతున్నాయి.

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments