Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్‌లో అవి వుండవట?

Webdunia
మంగళవారం, 19 మే 2015 (17:14 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమా బాహుబలి గురించే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రిలీజ్ కోసం రాజమౌళి ప్రస్తుతం కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో మంచి పేరు కొట్టేయాలనుకుంటున్న రాజమౌళి కొన్ని సీన్స్ కట్ చేస్తున్నారట. 
 
అవేంటంటే.. భారతీయ బాహుబలిలో ఉన్న అంశాలు.. అంతర్జాతీయ బాహుబలిలో ఉండవట. అదేనండీ.. సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, పొయటిక్ సీన్స్ వంటివి అంశాలు బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్‌లో ఉండవని తెలుస్తోంది. 
 
నేషనల్ వెర్షన్ బాహుబలి రన్నింగ్ టైమ్ 2.5 గంటలైతే.. ఇంటర్నేషనల్ వెర్షన్‌ 1.5 గంటలే ఉంటుందని.. ఇవి పార్ట్స్ వారీగా ఉంటాయని బాహుబలి యూనిట్ అంటోంది. ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవంలో బాహుబలిని ప్రదర్శించాలని మౌళి టీమ్ ప్రయత్నిస్తోంది. ఇంగ్లీష్, ఫ్రెంచ్‌ భాషలతో పాటు వివిధ విదేశీ భాషల్లోనూ బాహుబలి రిలీజ్ కానుందని సమాచారం. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments