Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాలో ఆ సీన్ కాపీ కొట్టలేదు: రాజమౌళి

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (17:01 IST)
తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్‌ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. ‘శాంభవి ఐపీఎస్’ సినిమాలోని ఓ సీన్‌ను ‘విక్రమార్కుడు’ సినిమా కోసం కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చారు. 
 
‘‘ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాల నుంచి, నవలల నుంచి కాపీ చేశాను. కానీ, శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్‌ను కాపీ కొట్టలేదు. చాలా కాలం క్రితం మా నాన్న ఆ సీన్‌ను రాశారు. శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఆ సీన్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ వ్యవహారం గురించి పట్టించుకునేంత టైమ్ కూడా నాకు లేదు. నా వివరణ కేవలం నన్ను విశ్వసించే వారి కోసం మాత్రమే’’ అని రాజమౌళి ఫేస్ బుక్, ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు.
 
రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో పోలీసులను విలన్ ఎగతాళి చేస్తాడు. ఆ సమయంలో భవనంపై నుంచి పడటంతో మెడలోని బెల్ట్ ఉరిపడటంతో విలన్ మరణిస్తాడు. శాంభవి ఐపీఎస్‌లో కూడా అలాంటి సీన్... ఒకటి ఉంటుంది. అయితే, ఆ సీన్ మొత్తం సేమ్ టు సేమ్ విక్రమార్కుడును పోలి ఉండటంతో కాపీ కొట్టారన్న సందేహాలు తలెత్తాయి.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments