Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని నాగేశ్వరరావు గారికి నా అవార్డు అంకితం.. అల్లు అర్జున్

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (19:14 IST)
‘రేసు గుర్రం’ ద్వారా తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న బన్నీ తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటారు. సౌతిండియాలోని సినీ పరిశ్రమలకు సంబంధించి ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిన్న సాయంత్రం ప్రకటించారు. నాలుగు భాషల సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో 2014లో విడుదలైన సినిమాల్లో వివిధ క్యాటగిరీల్లో టాప్ సినిమాలు పోటీలో నిలిచాయి.
 
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఉత్తమ నటుడు అవార్డును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ‘రేసుగుర్రం’ సినిమాలో నటనకుగానూ ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక గతంలో అల్లు అర్జున్ ‘పరుగు’, ‘వేదం’ సినిమాలకు ఉత్తమ నటుడుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకోగా తాజాగా ‘రేసుగుర్రం’తో ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును పొందిన హీరోల లిస్ట్‌లో చేరిపోయారు.
 
ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “రేసుగుర్రం చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవార్డును ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్నాన”ని తెలిపారు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments