Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆరోగ్యంపై డోంట్ వర్రీ... కమల్ హాసన్ చెప్పారు

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:30 IST)
ప్రముఖ దక్షిణాది సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తన తదుపరి చిత్రం షూటింగ్ లో ఉండగా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారనీ, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న ఊహాగానాలు కూడా తిరిగాయి.
 
తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమల్ హాసన్ తెలిపారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురయ్యానని, అంతకంటే ఏమీలేదన్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఫోన్‌లో కమల్ మాట్లాడుతూ.. "చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలనుకుంటారు. వారిని నిరుత్సాహపరుస్తున్నందకు సారీ. నేను బాగానే ఉన్నా. కేవలం ఫుడ్‌పాయిజన్ అయిందంతే. అంతకుమించి మరే కారణం లేదు" అని వివరించాడు. 
 
'పాపనాశనం' చిత్రం కోసం కేరళ మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందని, అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న దాబాల్లో తిన్నామన్నారు. బహుశా కలుషిత నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కమల్ పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్, డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నేను బాగానే వున్నాను. షూటింగ్ నిమిత్తం కేరళలోని మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో ఏదిపడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

Show comments