Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యం ఓకే.. కులాసాగానే ఉన్నా : కమల్ హాసన్ వెల్లడి

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:44 IST)
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారని వార్తలతో పాటు, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న వదంతులు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు. 
 
తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమల్ హాసన్ తెలిపారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురయ్యానని, అంతకంటే ఏమీలేదన్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఫోన్‌లో కమల్ మాట్లాడుతూ.. "చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలనుకుంటారు. వారిని నిరుత్సాహపరుస్తున్నందకు సారీ. నేను బాగానే ఉన్నా. కేవలం ఫుడ్‌పాయిజన్ అయిందంతే. అంతకుమించి మరే కారణం లేదు" అని వివరించాడు. 
 
'పాపనాశనం' చిత్రం కోసం కేరళ మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందని, అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న దాబాల్లో తిన్నామన్నారు. బహుశా కలుషిత నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కమల్ పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్, డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నేను బాగానే వున్నాను. షూటింగ్ నిమిత్తం కేరళలోని మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో ఏదిపడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఆయన వివరించారు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments