Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీ రా... తేల్చుకుందాం... ఎల్టీటీఈ ప్రభాకరన్ ఒక్కడే తమిళనాడు హీరో....

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (15:37 IST)
రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జనం ఏమనుకుంటున్నారో ఏమోగానీ తమిళనాడులో ఓ దర్శకనటుడు ఆయనకు సవాల్ విసురుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కారుకూతలు కూస్తున్న అతడిపేరు సీమాన్. నామ్ తమిళర్ కట్చి అనే పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నన్న సీమాన్... తాజాగా, రజనీ పొలిటికల్ ఎంట్రీ అంశంపై నోటికొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. 
 
అతడు కొన్ని పంచ్ డైలాగులు కూడా వదులుతున్నాడు. వాటిలో అతడు పేల్చిన ఒక డైలాగ్.... "ఒక్కడివే వస్తావా... మద్దతుతో వస్తావా... రా, తేల్చుకుందాం" అంటూ సినిమాటిక్ డైలాగులు విసురుతున్నాడు. అంతేకాదు తమిళ గడ్డను తమిళుడే ఏలాలనీ, రజినీ మరాఠీ కనుక అతడు తమిళనాట ఏలే అవకాశం లేదని అంటున్నాడు. 
 
ఎల్టీటీఈ నేత వేలుపిళ్లై ప్రభాకరన్ జయంతిని పురస్కరించుకుని అతడు మాట్లాడుతూ.. ప్రభాకరన్ కు పోటీ ఈ తమిళనాడులో మరెవ్వరూ లేరని అన్నాడు. అంతేకాదు ఆయనను మహానేత అని ప్రతి తమిళుడు పేర్కొనాల్సిందేనని చెప్పుకొచ్చాడు. సీమాన్ వ్యాఖ్యలపై రజినీకాంత్ అభిమానులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments