Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్‌ మీద చీటింగ్ కేసు... పరారీలో బండ్ల... వేటాడుతున్న పోలీస్

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (10:10 IST)
బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా హక్కులు విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారని ధర్మచరణ్ అనే ఫైనాన్సియర్ సోమవారం బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ప్రాంత హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించినట్లు తెలుస్తోంది. 
 
బండ్ల గణేష్ ఆ సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి విక్రయించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ పట్టించుకోకపోవడమే కాకుండా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని సదరు ఫైనాన్షియర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బండ్ల గణేష్ పైన ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేశారు. బండ్ల గణేష్ పరారీలో ఉన్నారనీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెపుతున్నారు.

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments