Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందుడు...' కథ లీక్... మీనా పాత్రలో రామ్ చరణ్... అంతేనట...

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (14:55 IST)
రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఓ పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం కొంత ప్యాచ్‌వర్క్‌ను ఈ నెల 20నుంచి హైదరాబాద్‌లో చేయనున్నారు. ఈ చిత్ర కథ కృష్ణవంశీ రూపొందించిన 'మురారి' తరహాలో వుంటుందని మొదట ప్రచారం జరిగింది. ఇప్పటికీ అలాగే వున్నా.. అందులో చిన్న మార్పు కూడా జరిగిందని తెలుస్తోంది. రాజ్‌కిరణ్‌ అనే తమిళ నటుడు పాత్రను మార్చేసి ప్రకాష్‌రాజ్‌ రావడంతోపాటు కథలో ఇంకాస్త క్లారిటీ వుండాలని చిరంజీవి కూడా సూచించాడని కథనాలు వెలువడ్డాయి.
 
దాంతో కొన్ని మార్పులు చేశారు. టైటిల్‌ను బట్టి... గోవింద్‌.. విదేశాల్లో వుంటాడు. తండ్రిని ఎదిరించి గోవింద్‌ తండ్రి ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతాడు. అక్కడ బాగా సెటిల్‌ అవుతాడు. తండ్రి కోరిక మేరకు గోవింద్‌ అంటే రామ్‌చరణ్‌ ఇండియా వస్తాడు. తన తాత దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆప్యాయతలు అన్నీ రుచిచూస్తాడు. ఇంత ఆప్యాయతలు అనుబంధాలతో వున్న మనుషులను మోసం చేయడం తగదని అసలు నిజం చెప్పేయాలనుకుంటాడు. 
 
అది వేరేవారి వల్ల తెలిసిపోతుంది. కట్‌ చేస్తే... గోవిందుడు... తల్లిదండ్రి ఓ ప్రమాదంలో చనిపోతారు. ఇక అక్కడ నుంచి ఫుల్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుంది. ఈ కథ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా.. అవును.. అక్కినేని నటించిన సీతారామయ్యగారి మనవరాలు... అందులో మీనా పాత్రను మార్చి రామ్‌ చరణ్‌కు సెట్‌ చేస్తే ఎలా వుంటుందనేది ఈ కథ. గోవిందుడు అనాథ కాదు.. అందరివాడేలే అంటూ శుభం కార్డు... క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవలే జరిగింది. ఆ సీన్‌ చూశాక.. ఇది పాత సినిమాకు రీమేక్‌ అని చిత్ర యూనిట్‌ వ్యాఖ్యానించారట.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments