Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి'గా బన్నీ... త్వరలో కొత్త చిత్రం ఆరంభం..!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (13:34 IST)
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం తెరకెక్కనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ మధ్య పవన్ కల్యాణ్ నటించిన చిత్రానికి 'అత్తారింటికి దారేది' అంటూ సంప్రదాయ భిన్నంగా టైటిల్ పెట్టిన త్రివిక్రమ్ తన తాజా చిత్రానికి 'సన్నాఫ్ సత్యమూర్తి'గా నామకరణం చేశారు. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించనున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్రానికి 'త్రిశూలం', 'హుషారు', 'జాదుగర్' వంటి పేర్లు పరిశీలించినా చివరికి 'సన్నాఫ్ సత్యమూర్తి' టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు మాత్రం సినిమా పేరును ఖరారు చేయలేదట. ఈ చిత్రంలో వెడ్డింగ్ ప్లానర్‌గా నటిస్తున్న బన్ని సరసన సమంతా, ఆదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ పేరునైనా ఉంచుతారా... ఊడబెరికి వేరే పేరు పెడతారా అనే సందేహం టాలీవుడ్ వర్గాల్లో ఏర్పడింది.
 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments